Husband hangs wife : దారుణం.. పిల్లలు పుట్టలేదని భార్యకు ఉరేసి కడతేర్చిన భర్త
Husband hangs wife : దారుణం.. పిల్లలు పుట్టలేదని భార్యకు ఉరేసి కడతేర్చిన భర్త

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Husband hangs wife : తనను నమ్మి వచ్చి, జీవితాన్నే ఇచ్చిన ఓ అభాగ్యురాలిని ఆమె భర్తే కడతేర్చాడు. పెళ్లి సమయంలో జీవితకాలం రక్షణగా నిలుస్తానని, అండగా ఉంటానని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త, చివరికి ఆమెకు యముడిగా మారాడు.

వరకట్నం కోసం ఓ వైపు, సంతానం లేదని మరోవైపు భర్త , అత్తమామలు, కుటుంబసభ్యులు ఎంత వేధింపులకు గురిచేసినా.. ఆ ఇల్లాలు ఓపికతో భరించింది. కాలమే వారిని మంచిగా మార్చి, తన బతుకు బాగు చేస్తుందని, తన జీవితంలో కూడా వసంతం వెల్లివిరుస్తుందని భావించిన ఆ తల్లి చివరికి భర్త చేతిలోనే హత్యకు గురైంది.

జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. పిల్లలు పుట్టలేదని భార్య మమతను ఉరేసి భర్త మహేందర్ హత్య చేశాడు. భార్యను ఇంటికి తీసుకెళ్లి గత నెల 24న కడతేర్చాడు. హత్య అనంతరం భార్య కనిపించట్లేదని పీఎస్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. నిందితుడు మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు అనుమానించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి చూడగా.. కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొడిమ్యాల పోలీసులు