Hyderabad | హైదరాబాద్​లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. భర్త ఎదుటే భార్యకు వేధింపులు
Hyderabad | హైదరాబాద్​లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. భర్త ఎదుటే భార్యకు వేధింపులు

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై సమాజంపై పడుతున్నారు. దారిన వెళ్లే అమాయక ప్రజలపై పడి వారిని వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై నీచంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా జీహెచ్​ఎంసీ పరిధి మధురానగర్​లో ఆకతాయిలు రెచ్చిపోయారు. భర్త ఎదుటే భార్యను ముగ్గురు యువకులు వేధించారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబరు ఇవ్వు అంటూ వేధింపులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి(మే 2) దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు హల్చల్ చేశారు.

ఎస్ఆర్​నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి భర్తపై ఆ ముగ్గురు కీచక యువకులు దాడి చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.