- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Alzheimers Day | జ్ఞాపకాలను చెరిపేసే శత్రువు..!

Alzheimers Day | జ్ఞాపకాలను చెరిపేసే శత్రువు..!

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Alzheimers Day | ప్రస్తుత కాలంలో చాలామంది మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో కనిపించే ఈ వ్యాధి క్రమేపీ మనిషి జ్ఞాపకశక్తిని హరించి వేస్తుంది.

తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రవర్తన, రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదట చిన్న విషయాలను మరచిపోవడం, మాటల్లో తడబాటు వంటి లక్షణాలు (symptoms) కనిపిస్తాయి. తర్వాత దశల్లో రోగి తన కుటుంబసభ్యులను కూడా గుర్తు పట్టలేని స్థితికి చేరవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్‌ మందికిపైగా డిమెన్షియాతో బాధపడుతున్నారు. వీరిలో 60–70శాతం కేసులు అల్జీమర్స్‌ (Alzheimer’s) వల్లే వస్తున్నాయి.

- Advertisement -

– ఆరోగ్యకరమైన జీవనశైలి – మనసు, శరీరానికి దూరమై ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, నిద్రలేమి వంటి మస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. చాలామంది మానసిక ఆరోగ్యాన్ని (mental health), శరీర ఆరోగ్యానికి పూర్తిగా వేరుగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

మన గుట్‌ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మధ్య గాఢమైన సంబంధం ఉందని, గుట్‌లో ఉండే సూక్ష్మజీవులు సిరోటోనిన్, డోపమిన్, వంటి రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మన భావోద్వేగాలు, నిద్ర, ఒత్తిడి ప్రతిస్పందనను ప్రభావితం చేస్తాయి. గుట్‌లో అసమతుల్యత ఏర్పడితే వాపు స్థాయిలుపెరిగి, మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి, నిరాశ, ఆందోళన (depression and anxiety) వంటి సమస్యలకు దారి తీస్తుంది.

– ప్రస్తుతం అల్జీమర్స్‌కు పూర్తి నయం చేసే చికిత్స లేకపోయినా, లక్షణాలను తగ్గించి వ్యాధి ప్రగతిని నెమ్మదింపజేసే కొన్ని ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గుట్‌ఆరోగ్యాన్ని కాపాడుతూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు ఇవే..

· ఫైబర్‌ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు తీసుకోవాలి.
· ప్రోబయోటిక్స్‌ (పెరుగు, కిమ్చీ, ఇతర ఫెర్మెంటెడ్‌ ఆహారాలు), ప్రీబయోటిక్స్‌ (ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు) గుట్‌ సూక్ష్మజీవుల సంరక్షణకు సహాయ పడతాయి.
· అధికకొవ్వు, ప్రాసెస్డ్‌ ఫుడ తగ్గించి, సమతుల ఆహారం తీసుకోవాలి.
· ప్రతిరోజూ మితమైన వ్యాయామం చేయాలి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
· తగినంత నిద్ర ద్వారా మెదడు విశ్రాంతి తీసుకొని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
· ధ్యానం, యోగా, హాబీలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడతాయి.

– డా గౌతమ్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, వినాయక ఆసుపత్రి, నిజామాబాద్‌

 

ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం (World Alzheimer’s Da) మనకు మానసిక, గుట్‌ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకునే మంచి అవకాశం ఇస్తుంది. మానసిక సమస్యలపై ఉన్న సాంఘిక అపహాస్యాన్ని (స్టిగ్మాను) తొలగించడం, జీవనశైలి,ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం, మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరం. జ్ఞాపకాలను కాపాడుకోవాలంటే అవగాహన, ప్రేమ, ముందస్తు సంరక్షణే ప్రధాన ఆయుధాలు. దీన్ని అరికట్టాలంటే ముందుగానే అవగాహన కలిగి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం తప్పనిసరి.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News