ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | కీలక మ్యాచ్‌లో SRH ఓటమి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్!

    IPL 2025 | కీలక మ్యాచ్‌లో SRH ఓటమి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆరెంజ్ ఆర్మీ.. 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తయ్యింది. గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ ప్రసిధ్ కృష్ణ(2/19) పొదుపైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు.

    225 పరుగుల భారీ లక్ష్యచేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, గెరాల్డ్ కోయిట్జీ చెరో వికెట్ తీసారు.

    అంతకుముందు గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరోసారి టాప్-3 బ్యాటర్లు శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76), జోస్ బట్లర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64), సాయి సుదర్శన్(23 బంతుల్లో 9 ఫోర్లతో 48) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/35) మూడు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ చెరో వికెట్ తీసారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంటే.. గుజరాత్ టైటాన్స్ మాత్రం సంచలన ఫీల్డింగ్‌తో గెలుపొందింది.

    ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయలేదు. చివరికి చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ రన్‌రేట్ కూడా మెరుగ్గా లేదు. మరోవైపు ఏడో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 7 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    More like this