అక్షరటుడే, మెండోరా: Mendora mandal | కుటుంబ తగాదాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెండోరా మండలంలో (Mendora mandal) చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని (SI Suhasini) తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా గ్రామానికి చెందిన అక్కారం రవి (35) సెంట్రింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు.
ఈనెల 16వ తేదీన మద్యం మత్తులో ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన కుటుంబీకులు తీవ్రంగా గాయపడ్డ రవిని నిజామాబాద్ జీజీహెచ్‌కు (Nizamabad GGH) తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.