PCC Chief
PCC Chief | పీసీసీ చీఫ్​ను సన్మానించిన కాంగ్రెస్​ నాయకులు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: PCC Chief | జిల్లాకు విచ్చేసిన పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​(PCC chief Bomma Mahesh Kumar Goud)ను కాంగ్రెస్​ నాయకులు ఘనంగా సన్మానించారు.

పీసీసీ చీఫ్​గా నియమితులై ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా.. నగరంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో (R&B Guest House) ఆయనను గజమాలతో సన్మానించారు. కేక్​ కట్​ చేయించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కాంగ్రెస్ నాయకులు నగేష్ గౌడ్, రత్నాకర్, నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.