Municipal Corporation
Municipal Corporation | పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు దూరం

అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు వ్యాపించవని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Commissioner Dilip Kumar) అన్నారు. నగరంలోని ఐటీఐ మైదానంలో వాకర్ అసోసియేషన్ (Walker Association) ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ ఇంటి వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. హానికరమైన ప్లాస్టిక్​తో కలిగే నష్టాలను వివరించారు. అలాగే ఇంటి వ్యర్ధాలను తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ చెత్త వాహనంలోనే (municipal garbage vehicle)  వేయాలన్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీల్లోనూ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవిబాబు, శానిటరీ ఇన్​స్పెక్టర్లు, జవాన్లు వాకింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పృథ్వీరాజ్, మోహన్, మురళి, లక్ష్మణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.