District Library
District Library | గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తా: పీసీసీ చీఫ్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: District Library | జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు సంబంధించి నూతన భవన నిర్మాణం కోసం అన్ని విధాలా కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar) హామీ ఇచ్చారు.

జిల్లా కేంద్ర గ్రంథాలయం నూతన భవన నిర్మాణ స్థలాన్ని శనివారం పీసీసీ చీఫ్​ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. గ్రంథాలయానికి వచ్చి కాంపిటేటివ్​ పరీక్షలకు (Competitive exams) సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్నివిధాలా ఉపయోగపడేలా భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ (District Library Association) ఛైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి (Antireddy Raja Reddy) మాట్లాడుతూ పాత డీఈవో కార్యాలయం ఖాళీ స్థలంలో అన్ని హంగులతో అధునాతన భవనం నిర్మించాలని కోరారు. పాత డీఈఓ కార్యాలయ భవనం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నందున అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, శేఖర్ గౌడ్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.