Nizamabad City
RTC Buses | దసరాకు 388 ప్రత్యేక బస్సులు

అక్షరటుడే, ఇందూరు : RTC Buses | దసరా పండుగ (Dussehra Festival) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ప్రధానంగా నిజామాబాద్ రీజియన్ (Nizamabad Region) నుంచి సికింద్రాబాద్, అలాగే తిరుగు ప్రయాణానికి అదనపు బస్సులు వేశామన్నారు.

RTC Buses | 26వ తేదీ నుంచి..

ఈనెల 26న 50, 27న 80 బస్సులు, 28న 68 బస్సులు, 29 నుంచి ఒకటో తేదీ వరకు 50 చొప్పున బస్సులను సికింద్రాబాద్​కు, అలాగే ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు (Special Buses) నడుస్తాయన్నారు. రీజియన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా జేబీఎస్ బస్టాండ్​లో డిపోల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతమైన, ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. టికెట్ బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్​సైట్​లో సంప్రదించాలన్నారు.