అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. శనివారం ఎస్జీఎస్ పద్మావతి నిత్య అన్నదాన ఇందూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదలకు నిత్యాన్నదానం చేయడం అభినందనీయమని, ట్రస్ట్‌కు తనవంతుగా రూ.1,01,116 విరాళం అందించినట్లు పేర్కొన్నారు. సేవా దృక్పథంతో అన్నదానం (Annadanam) చేయడంపై నిర్వాహకులను ప్రశంసించారు.
అలాగే ఆలయంలో జరుగుతున్న అన్నదాన సేవలు, ఆలయ అభివృద్ధి, తదితర అంశాలపై స్థానిక ఎమ్మెల్యేతో చర్చిస్తానని, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాం భూపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.