Banswada
Banswada | ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని దేశాయిపేట గ్రామ (Desaipet Village) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) ఉత్సాహంగా నిర్వహించారు.

బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు కలిసి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. స్థానికులు కూడా హాజరై వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి (Telangana Culture) బతుకమ్మ పండుగ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.