Yedapally
Yedapally | జీపీని ముట్టడించిన పింఛన్​దారులు

అక్షరటుడే, బోధన్​: Yedapally | పింఛన్​ పెంచి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్​ చేశారు. ఈమేరకు వీహెచ్​పీఎస్​ ఆధ్వర్యంలో ఎడపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ( Yedapally Panchayat office) శనివారం పింఛన్​దారులు ముట్టడించారు.

ఈ సందర్భంగా వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత, బీడీ కార్మికులకు (beedi workers) రూ. 4వేల పింఛన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అలాగే కండరాల క్షీణత ఉన్నవారికి రూ.15వేలు ఇవ్వాలని కోరారు.

Yedapally | సీఎం మోసం చేస్తున్నారు..

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచి ఇస్తామని సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారని సుజాత సూర్యవంశి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. పింఛన్లు పెంచి ఇస్తారని లబ్ధిదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, ఎంఎంఎస్​ జిల్లా సీనియర్​ నాయకురాలు సావిత్రి, ఆఫీజ, బాలమణి, స్వర్ణలత, హైమదీ, సునీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.