అక్షరటుడే, ఇందూరు : Nizamabad City | వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలీ, దడ్వాయి, గుమస్తా, చాట, స్వీపర్ వర్కర్స్ రాష్ట్ర మహాసభ ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో (AITUC Office) శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రెండో మహాసభ నిజామాబాద్ మార్కెట్ యార్డులోని (Market Yard) ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), మార్కెట్ యార్డు ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, తదితరులు హాజరవుతారని చెప్పారు.
ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న విధానాలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో మార్కెట్ యార్డుల అభివృద్ధికి తీసుకునే కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చ ఉంటుందన్నారు. కావున కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, ఉపాధ్యక్షులు చక్రపాణి, భాగ్యలక్ష్మి, సాయిలు, కార్యదర్శులు హన్మాండ్లు, అనిత, కవితా, సంపత్ తదితరులు పాల్గొన్నారు.