Mla Dhanpal
Mla Dhanpal | దేవిమాత మండపాలకు పట్టుచీరల పంపిణీ

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నగరంలోని పలు దేవిమాత మండపాలకు అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా పట్టుచీరలను పంపిణీ చేశారు. మార్వాడీగల్లీలోని (Marwadi Gali) తన కార్యాలయంలో శనివారం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదకొండేళ్ల నుంచి ధన్​పాల్​ లక్ష్మీబాయి, విఠల్​గుప్తా ట్రస్ట్​ ఆధ్వర్యంలో హిందూ పండుగలకు సహాయసహకారాలు అందజేస్తున్నానన్నారు.

Mla Dhanpal | శరన్నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత..

హిందూ ధర్మరంలో శరన్నవరాత్రులకు ప్రాముఖ్యత ఉందని ధన్​పాల్​ అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగ జరుపుకుంటారని వివరించారు. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతని వధించిన సందర్భంగా విజయదశమి (Vijaya dashami) జరుపుకుంటారన్నారు.

హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించడానికి.. ప్రతి కార్యానికి తన ట్రస్ట్​ ద్వారా సేవలందిస్తూ ముందుంటానన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkata Reddy), ట్రస్ట్ సభ్యులు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.