అక్షరటుడే, బోధన్ : Bodhan | వాటర్ ట్యాంకర్ ఢీకొని హైదరాబాద్(Hyderabad)లో బోధన్ వాసి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సాలూర మండలం (Saloora Mandal) హున్సాకు చెందిన నందకుమార్(21) హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు.
అయితే శనివారం నగరంలోని పటాన్చెరు మీదుగా విధులకు వెళ్తుండగా.. వాటర్ ట్యాంక్(Water Tank) ఢీకొట్టింది. దీంతో అయన అక్కడికక్కడే మృతిచెందాడు. నందకుమార్ తండ్రి ఏడాది క్రితమే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి (Patancheru Government Hospital) తరలించారు. విషయం తెలుసుకున్న బోధన్‌లోని ఆయన కుటుంబీకులు, బంధువుల హైదరాబాద్ వెళ్లారు.