Sriram Sagar
Sriram Sagar | ఎస్సారెస్పీలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు విద్యుద్యుత్పత్తి కేంద్రంలో (Sriram Sagar Project Power Plant) ఉత్పత్తి కొనసాగుతోంది. మొత్తం నాలుగు టర్బయిన్​ల ద్వారా విద్యుత్​ ఉత్పత్తి (power generation) కొనసాగుతోందని డీఈ శ్రీనివాస్​ తెలిపారు.

ఒకటో టర్బయిన్​ ద్వారా 9.10 మిలియన్​ వాట్స్​, రెండో టర్బయిన్​ ద్వారా 9.15 మిలియన్​ వాట్స్​, మూడో టర్బయిన్​ ద్వారా 9.05 మిలియన్​ వాట్స్​, నాలుగో టర్బయిన్​ ద్వారా 9.10 మిలియన్​ వాట్స్​ కలిపి మొత్తం నాలుగు టర్బయిన్ల ద్వారా 36.40 మిలియన్​ వాట్స్​ విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కాగా.. గత నెల రోజుల్లో 15.7788 మిలియన్​ యూనిట్స్​ ఉత్పత్తి అయినట్లు వివరించారు. ఈ యేడు 31.8352 మిలియన్​ యూనిట్స్​ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.