అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో శుక్రవారం పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్ నియంత్రణ అంశాలపై జరిగిన చర్చ ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా(TDP MLA Bonda Uma), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
పరిశ్రమల కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని బోండా ఉమ తీవ్రంగా మండిపడ్డారు. “విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) కార్యాలయం లేదు. ప్రజలు ఫిర్యాదులతో వెళ్లినా ‘డిప్యూటీ సీఎం వద్ద నుంచి చెప్పించండి’ అని తిరస్కరిస్తున్నారు. బోర్డు చైర్మన్ అధికారిగా కాకుండా రాజకీయ సూచనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు” అని ఆయన విమర్శించారు.
AP Assembly | పవన్ కళ్యాణ్ కౌంటర్
బోండా ఉమ వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అవి తప్పుడు ఆరోపణలని ఖండించారు. “పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందుబాటులో ఉండదని చెప్పడం సరికాదు. మా శాఖ ఇప్పటికే రాంకీ సంస్థపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కానీ ఒక సంస్థను లేదా వ్యక్తిని కావాలని టార్గెట్ చేయకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పరిశ్రమలపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటే ఎన్నో కంపెనీలు మూతపడే ప్రమాదం ఉంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల ఉనికిని కూడా సమన్వయం చేయడం అవసరం అని నొక్కి చెప్పారు. అంతేకాదు, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. మూడు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.మొత్తం మీద పరిశ్రమల కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామికాభివృద్ధి అనే మూడు కీలక అంశాలు అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యేతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాదోపవాదాలు సభను కాసేపు వేడెక్కించాయి.