Asia Cup 2025 | ఆసియా కప్ 2025 : వరుసగా మూడో విజయంతో సూపర్-4లో భారత్.. ఓడినా ఆక‌ట్టుకున్న ఒమ‌న్
Asia Cup 2025 | ఆసియా కప్ 2025 : వరుసగా మూడో విజయంతో సూపర్-4లో భారత్.. ఓడినా ఆక‌ట్టుకున్న ఒమ‌న్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup 2025 | ఆసియా కప్ 2025 లో టీమిండియా Team India దుమ్మురేపుతోంది. వరుసగా మూడు విజయాలు సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా సూపర్-4కు అర్హత సాధించింది.

శుక్రవారం (సెప్టెంబరు 19) ఒమన్‌ Oman తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత హాఫ్ సెంచరీతో రాణించగా, తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (26) వేగంగా రన్స్ సాధించారు.

ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, జితేన్, అమీర్ కలీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో ఒమన్ ధైర్యంగా ఆడింది. ఓపెనర్లు విఫలమైనా, అమీర్ కలీమ్ (64), హమ్మద్ మిర్జా (51) కీలక భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు.

Asia Cup 2025 | అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ T 20 ల్లో 100 వికెట్ల మైలురాయి దాటిన తొలి భారత బౌలర్​..
Asia Cup 2025 | అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ T 20 ల్లో 100 వికెట్ల మైలురాయి దాటిన తొలి భారత బౌలర్​..

Asia Cup 2025 | స‌రికొత్త రికార్డ్..

కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా సహకరించాడు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా ఆడటంతో ఒమన్ 4 వికెట్ల నష్టానికి 167 పరుగుల వద్దే ఆగిపోయింది.

భారత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌ను భారత జట్టు Team India పూర్తి స్థాయి సన్నాహకంగా ఉపయోగించుకుంది.

ప్రతి ఆటగాడికి బ్యాటింగ్, బౌలింగ్ అవకాశాలు ఇచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్షంగా గెలిచిన భారత్‌కు ఈ మ్యాచ్ కొంత కఠినంగా మారింది.

అయినప్పటికీ కీలక సమయంలో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మరోవైపు ఒమన్ తన స్థాయికి మించి పోరాడి ప్రశంసలు అందుకుంది.

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ Arshdeep Singh ఈ మ్యాచ్‌తో స‌రికొత్త‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా చ‌రిత్ర‌లోకి ఎక్కాడు.

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో వ‌చ్చిన‌ అర్ష్‌దీప్ సింగ్.. ఆఖరి ఓవర్‌లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా(1)ను ఔట్ చేసి అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. 64 మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం.