OG benefit shows | టీజీలో ఓజీ బెనిఫిట్ షోస్‌.. సర్కారు గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
OG benefit shows | టీజీలో ఓజీ బెనిఫిట్ షోస్‌.. సర్కారు గ్రీన్ సిగ్న‌ల్.. టిక్కెట్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: OG benefit shows | ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan Kalyan ఏపీ డిప్యూటీ సీఎం AP Deputy CM అయ్యాక ఆయ‌న హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.

Harihara Veeramallu సినిమాపై అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నా మూవీ నిరాశ‌ప‌రిచింది. దీంతో Power Star ప‌వ‌న్ త‌దుపరి చిత్రం ఓజీపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు.

ప‌వర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ షోస్‌కు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

OG benefit shows | అనుమ‌తి వ‌చ్చేసింది..

తాజాగా తెలంగాణ ప్రభుత్వం Telangana Govt కూడా ఓజీ ప్రీమియర్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. శుక్రవారం (సెప్టెంబరు 19) సాయంత్రం అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.

సెప్టెంబరు 24న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోస్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఈ ప్రీమియర్‌ టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు.

అలాగే సినిమా విడుదల రోజైన సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరలను పెంచుకునే వీలు కల్పించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) అదనంగా వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రన్ రాజా రన్, సాహో Saaho సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అలాగే ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించగా.. గన్స్ అండ్ రోజెస్ తో సహా ఇతర పాటలు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఓజీ.. పవన్ అభిమానులకు, ప్రేక్షకులకు విజయదశమి కానుకగా సెప్టెంబరు 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.