IND vs OMAN |
IND vs OMAN |

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs OMAN | ఆసియా కప్ (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు శుక్రవారం (సెప్టెంబరు 19) తన చివరి గ్రూప్ మ్యాచ్ ఒమన్​తో ఆడింది.

ఈ మ్యాచ్​లో భారత్​ విజయం సాధించింది. ఒమన్​ చివరి వరకు పోరాడి ఓడింది. ఒమన్​ ఆటగాళ్లలో అమీర్​ ఖలీమ్​ 64 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్​ చేపట్టిన భారత ఆటగాళ్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేశారు. పవర్​ ప్లేలో భారత ఆటగాళ్లు బాగానే ఆడారు.

ఆరు ఓవర్లలో ఒక వికెట్​ నష్టానికి 10 రన్ రేట్‌తో రెచ్చిపోయారు. బ్యాటర్​ సంజు శాంసన్‌ (56 పరుగులు) హాఫ్‌ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా కేవలం ఒకటే పరుగు చేసి రన్​ ఔట్​ అయ్యాడు.

ఒమన్​ Oman ఆటగాళ్లు మధ్యలో బాగానే ఆడినా.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయారు. ముఖ్యంగా చివరి ఓవర్లో పరిస్థితి తలెత్తింది.

దీంతో ఒమన్​ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది. ఈ క్రమంలో భారత్​ 21 పరుగులతో ఘన విజయం సాధించింది.

IND vs OMAN : ఇప్పటికే సూపర్​ ఫోర్​కు అర్హత..

ఇక భారత ఆటగాళ్లు ఇప్పటికే వరుసగా రెండు విజయాలు అందుకుని సూపర్ ఫోర్‌కు అర్హత పొందారు. ఈరోజు కూడా గెలిచి, నంబర్ 1 స్థానంలో ఉన్న గ్రూప్ దశను ముగించారు. ఇక వరుసగా రెండు ఓటములతో ఒమన్ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించింది.

కాగా, భారత్ మరో గెలుపు అందుకుని, ఆసియా కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన శ్రీలంక రికార్డును సమం చేసింది.