New schemes | మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు.. ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్​
New schemes | మైనారిటీల కోసం రెండు కొత్త పథకాలు.. ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్​

అక్షరటుడే, హైదరాబాద్: New schemes : మైనార్టీల సంక్షేమం కోసం రేవంత్ సర్కారు రెండు కొత్త పథకాలు తీసుకొచ్చింది.

వీటిని సచివాలయంలో శుక్రవారం (సెప్టెంబరు 19) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అద్లూరి లక్ష్మణ్ కుమార్ SC, ST and Minority Welfare Minister Adluri Laxman Kumar ప్రారంభించారు.

మంత్రి ప్రారంభించిన పథకాల్లో ఒకటి ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ (Indiramma Minority Mahila Yojana) పథకం తీసుకొచ్చింది. దీని ద్వారా వితంతువులు, ఒంటరి మహిళల కోసం రూ.50 వేలు ఆర్థిక సాయం అందిస్తారు.

రెండోది.. ‘రేవంతన్నా కా సహారా’ (Revanthanna Ka Sahara) పథకం. దీని ద్వారా దూదేకులు, ఫకీర్ వంటి.. వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ.లక్ష గ్రాంట్‌తో మోపెడ్స్ సాంక్షన్​ చేస్తారు.

New schemes : అక్టోబరు 6 లోగా..

మైనార్టీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ పథకాలకు అర్హులైనవారు నేటి నుంచి అక్టోబరు 6 లోగా  https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మైనార్టీల సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాల scheme కోసం ప్రభుత్వం రూ. 30 కోట్ల నిధులు కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.

మైనారిటీ వర్గాల్లోని అందరికి సమగ్ర సంక్షేమాన్ని అందించడానికి తమ కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ పథకాలు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.