అక్షర టుడే, ఇందల్వాయి : Indalwai | మండలంలోని ఏకలవ్య మోడల్ పాఠశాలలో (Ekalavya Model School) గురువారం 53వ జాతీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన (Children’s Science Exhibition) నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తాము రూపొందించిన ప్రయోగాలను ప్రదర్శించారు.
వాయు కాలుష్యం, హరిత శక్తి, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, జీర్ణవ్యవస్థ, సుస్థిర వ్యవసాయం, నామిని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, తదితర అంశాలపై ప్రయోగాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా తెయూ బోటనీ ప్రొఫెసర్ డా అహ్మద్ అబ్దుల్ హలీంఖాన్ హాజరై ప్రదర్శనలు తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.