ePaper
More
    Homeఅంతర్జాతీయంearthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    earthquake | అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: earthquake | దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా(argentina)లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్​పై 7.4గా నమోదైంది. ఉషుయాకు దక్షిణంగా 136 మైళ్ల దూరంలో ఉన్న డ్రేక్ జలసంధిలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే(US Geological Survey) తెలిపింది. ప్రమాద తీవ్ర నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అర్జెంటీనాలోని డ్రేక్ పాసేజ్ సమీపంలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత చిలీ తన దక్షిణ ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు అర్జెంటీనా, చిలీ దేశాల్లోని తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అలర్ట్​లు జారీ చేశారు.

    భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంత ప్రజలందరినీ దూరంగా తరలివెళ్లాలని అధికారులు కోరారు. మగల్లనెస్ ప్రాంత తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని చిలీ జాతీయ విపత్తు నివారణ, ప్రతిస్పందన దళం అక్కడి ప్రజలకు సూచించింది. “మాగల్లనెస్ ప్రాంతమంతా తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని పిలుపునిస్తున్నాము” అని అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ Xలో పోస్ట్ చేశారు. అలాగే, దీనికి సమీపంలోని అంటార్కిటిక్(Antarctic) ప్రాంతాలను ఖాళీ చేయమని కూడా సూచించారు. సముద్రపు అలలు 3 నుంచి 10 అడుగుల ఎత్తు ఎగసి పడొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. దక్షిణ చిలీ తీర ప్రాంతాలతో పాటు అంటార్కిటికా ఖండంపై సునామీ ప్రభావం ఉండచ్చని పేర్కొంది. సునామీ తొలి అల అంత తీవ్రంగా ఉండకపోయినా తరువాత వచ్చే అలల తాకిడి ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...