Gazetted Headmasters Association
Gazetted Headmasters Association | పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి

అక్షరటుడే, ఇందూరు: Gazetted Headmasters Association | పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్​ హెడ్​మాస్టర్లను అసోసియేషన్​ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో అశోక్​కు (DEO Ashok) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్​ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్​, రఘునందనాచారి మాట్లాడుతూ 2025 మే, జూన్​ మాసంలో పనిచేసిన జీహెచ్​ఎంలకు ఈఎల్స్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2025‌‌–26 విద్యా సంవత్సరం ప్రారంభైనప్పటి నుంచి వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు రాలేదన్నారు.

2024లో నియామకమైన ఉపాధ్యాయులకు అక్టోబర్​ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వేతనాలకు సంబంధించిన బిల్లులు చేసేందుకు మ్యాచింగ్​ ఆర్డర్​ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గెజిటెడ్​ హెచ్​ఎం అసోసియేషన్​ సభ్యులు పాల్గొన్నారు.