Nizamabad CP
Nizamabad CP | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad CP | డీఎడ్‌ సెకండియర్‌తో పాటు పది, ఇంటర్‌ ఓపెన్‌ పరీక్షల (Open examinations) నేపథ్యంలో కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 22 నుంచి 27 వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు 163 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడవద్దన్నారు. కేంద్రాలకు పరిసర ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూసి ఉంచాలని చెప్పారు.