అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (SRNK Government Degree College) ‘ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాలు’ అనే అంశంపై శుక్రవారం మేరా యువ భారత్ సంస్థ ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఇందూర్ గంగాధర్ అధ్యక్షత మాట్లాడారు.
గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై (schemes) విద్యార్థులకు అవగాహన కల్పించారు. అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందక నిరుపయోగంగా మిగిలిపోతున్నాయన్నారు. బ్యాంకుల్లో (Banks) రుణం పొందే సమయంలో సిబిల్ స్కోర్ ప్రాముఖ్యతను కెనరా బ్యాంక్ మేనేజర్ సచిన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్, మేరా యువ భారత్ ఇన్‌ఛార్జి సునీల్ రాథోడ్, వినోద్ కుమార్, రచన, అధ్యాపకులు భగవాన్ రెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ బున్ని వినయ్ కుమార్, ఎన్సీసీ కోఆర్డినేటర్ కృష్ణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు పోతరాజు శ్రీనివాస్, రాజేష్, చిరంజీవి, అంబయ్య, శంకర్రావు, విఠల్, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.