అక్షరటుడే, కామారెడ్డి: SP Kamareddy | డ్రంక్ అండ్ డ్రైవ్లో (Drunk driving) పట్టుబడిన వాహనదారులకు కామారెడ్డి కోర్ట్ (Kamareddy Court) జరిమానా విధించిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో 33 మందికి రూ.33వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఇందులో 8 మందికి ఒకరోజు శిక్షతో రూ.1,100 చొప్పున, ముగ్గురికి ఒకరోజు శిక్షతో పాటు రూ.1,000, 22మందికి రూ.1,000 చొప్పున జడ్జి జరిమానా విధించారన్నారు.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ (Kamareddy Police Station) పరిధిలో 18 మంది, గాంధారి పరిధిలో ముగ్గురు, ఎల్లారెడ్డి పరిధిలో ఆరుగురు, దేవునిపల్లి పరిధిలో ఇద్దరు, మాచారెడ్డి(Machareddy), బీబీపేట పరిధిలో ఒక్కరు చొప్పున మొత్తం 33 మందికి రూ.33,800 జరిమానా విధించినట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఆయన సూచించారు.