అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | పట్టణంలో వివిధ వార్డుల్లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లను మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ (Municipal Commissioner Gopu Gangadhar) శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. స్లాబ్ లెవల్ (slab level) పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వార్డ్ ఆఫీసర్లకు తెలపాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.