అక్షరటుడే, ఆర్మూర్: Armoor | మున్సిపాలిటీ పరిధిలో ఫైర్‌సేఫ్టీ లేని అపార్ట్మెంట్లపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ (BRS town president Pooja Narender) డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం అగ్నిమాపక శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్ (Kotarmoor) పాత నిమ్మల గార్డెన్ ఎదురుగా ఓ భవంతి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారన్నారు. అపార్ట్‌మెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. తక్షణమే అపార్ట్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకుడు మీరా శ్రావణ్, పృథ్వీ పాల్గొన్నారు.