Nizamabad City
Nizamabad City | నిజామాబాద్​ ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీగా దయాకర్​ గౌడ్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | నిజామాబాద్​ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (Nizamabad District SC and ST Court) పబ్లిక్​ ప్రాసిక్యూటర్​గా దయాకర్​ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ రవి గుప్తా (Ravi Gupta) ఉత్తర్వులు జారీ చేశారు.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్ట్​గా​ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం 2004లో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ సెల్​ రాష్ట్ర కో–కన్వీనర్​గా కొనసాగుతున్నారు. కాగా.. దయాకర్​ గౌడ్​ (Dayakar Goud) పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పీసీసీ చీఫ్​​ మహేశ్​కుమార్​గౌడ్​ (Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.

Nizamabad City | దయాకర్​​ గౌడ్ ప్రస్థానం

  • పదో తరగతి నిజామాబాద్​ రావుజీ సంఘం ఉన్నత పాఠశాలలో 1991లో పూర్తి చేశారు.
  • ఇంటర్మీడియట్​ నగరంలోని సీఎస్​ఐలో 1991- 1993 వరకు అభ్యసించారు.
  • బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1993-96లో డిగ్రీ చదివారు.
  • 1997-2001లో నిజామాబాద్ లా కళాశాలలో అభ్యసించారు.
  • 2001 బార్ కౌన్సిల్​ ఎన్​రోల్​మెంట్ అయ్యారు.

జూనియర్ న్యాయవాదిగా బండారి కృష్ణా వద్ద ప్రాక్టీస్​ మొదలు పెట్టారు. జర్నలిస్ట్​గా ప్రస్థానం మొదలు పెట్టి న్యాయవాదిగా, పీపీగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర లీగల్ సెల్ కో–కన్వీనర్​గా సైతం సేవలు అందించారు.