అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | నీట్ పీజీ పరీక్షలో (NEET PG Exam) రాష్ట్రస్థాయిలో 27వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 558వ ర్యాంకు సాధించిన డాక్టర్ దీక్షితను నిజామాబాద్ మెడికల్ కాలేజీలో (Medical College) శుక్రవారం సన్మానించారు.
ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, వైస్ ప్రిన్సిపాల్స్ నాగమోహన్, జలగం తిరుపతి రావు, కిషోర్‌కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. దీక్షిత తమ కాలేజీకి గర్వకారణమన్నారు. ఆమె విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత, స్వీయ కృషి కారణమని చెప్పారు. ప్రణాళికాబద్ధమైన చదువు, క్రమశిక్షణతో నీట్ పీజీ పరీక్షలో విజయం సాధించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.