CM Revanth Reddy
CM Revanth Reddy | కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు.ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియామాలు స్పష్టంగా లేవన్నారు. కాగా బీఆర్​ఎస్(BRS)​ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్​ఎస్​ నాయకులు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించగా.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్​కు సూచించింది. ఈ మేరకు ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో తాము బీఆర్​ఎస్​లోనే ఉన్నట్లు స్పీకర్​కు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా సీఎం సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy | ఎంతో మందికి కప్పాను

తాను ఎంతో మందికి కండువా కప్పినట్లు సీఎం తెలిపారు. ఈ రోజు కూడా పలువురికి కండువా వేశానన్నారు. కప్పిన కండువాలో ఏముందో వారికి కూడా తెలియదన్నారు. అయినా కూడా కప్పించుకున్నారని చెప్పారు. అలా కండువా వేయించుకున్న వారందరూ కాంగ్రెస్​లో చేరినట్లు కాదని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ ఫిర్యాదు చేసిన పది మంది ఎమ్మెల్యేల వేతనాల నుంచి ప్రతి నెల రూ.5 వేలు ఆ పార్టీకి వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. BRSకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అసెంబ్లీలో హరీష్‌రావు(Harish Rao) ఆన్‌రికార్డ్ చెప్పారన్నారు. దీంతో వారు కాంగ్రెస్​లో చేరలేదని ఆయన చెప్పారు. ఇంటికొచ్చిన వారికి మర్యాదపూర్వకంగా కండువా వేస్తే పార్టీ మారినట్లు అవుతుందా అని ప్రశ్నించారు.

CM Revanth Reddy | కవితకు మద్దతు తెలుపలేదు

తాను ఎక్కడ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు సపోర్ట్​ చేయలేదని రేవంత్​రెడ్డి అన్నారు. ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్‌ కుటుంబంలో సమస్య వచ్చిందని చెప్పారు. వాళ్ల పంచాయితీకి తనకు ఎలాంటి సంబంధం లన్నారు. వారి కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. చంద్రబాబు, తాను ఒకటేనని ప్రచారం చేస్తుండటంతోనే.. కేటీఆర్‌, లోకేష్‌ కలిసిన విషయం చెప్పానని సీఎం తెలిపారు.

CM Revanth Reddy | ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేస్తామని గతంలో మంత్రులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు నోటిఫికేషన్​ వెలువడలేదు. దీంతో ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

CM Revanth Reddy | ఉసురు పోసుకున్నారు

ఉద్యమం పేరుతో కేసీఆర్​ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారని రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఊరికే పోదన్నారు. హైదరాబాద్​ మెట్రో విస్తరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని ఆయన అన్నారు.