Kavitha
Banswada | కాశీలో సహస్ర చండీయాగం, కోటి దీపోత్సవానికి కవితకు ఆహ్వానం

అక్షరటుడే, బాన్సువాడ : Banswada | కార్తీకమాసం(Karthika Masam) సందర్భంగా కాశీలో విశిష్ట ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభం కానున్నాయి. పరమహంస పరివ్రాజకాచార్య సుదర్శన ఆశ్రమ దండి స్వామి(Dandi Swami) ఆధ్వర్యంలో 1800 మంది ట్రస్టు సేవా సభ్యులతో కలిసి సహస్రచండీ యాగం, రుద్రయాగం, కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ యాగానికి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు సుదర్శన ఆశ్రమ దండి స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్(Hyderabad)​లోని కవిత నివాసానికి వెళ్లిన ఆయన ఆమెకు ఆహ్వానపత్రికను అందించారు. నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో గంగాపూజ, యాగశాల అగ్ని ప్రతిష్ఠ, చండీ సప్తశతి పారాయణం, రుద్రహోమం, తులసి వివాహం(Tulasi Vivaham), లక్షవత్తుల దీపోత్సవం, కోటి దీపోత్సవం(Koti Deepothsavam) విశేషంగా చేపట్టనున్నారు. పీఠాధిపతుల సమక్షంలో భక్తులు కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ స్వామి దర్శనాలు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మానస, కొట్టూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.