అక్షరటుడే, బాన్సువాడ: Drugs Department | నియోజకవర్గంలోని వర్ని మెడ్‌ప్లస్ మెడికల్‌లో (Medplus Medical) మూడురోజుల క్రితం ఓఆర్ఎస్ ప్యాకెట్లో చెత్తచెదారం వచ్చింది. దీంతో బాధితులు జిల్లా మెడికల్, డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా డ్రగ్స్ శాఖ అధికారులు (drugs department officials) సదరు మెడికల్ షాప్‌లో శుక్రవారం తనిఖీలు చేపట్టారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత (Drug Inspector Srilatha) ఆధ్వర్యంలో మెడికల్ షాప్‌లో మందుల ఎక్స్పైరీ తేదీలను, అలాగే ఇతర పదార్థాలను తనిఖీ చేశారు. వినియోగదారులు కొనుగోలు చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం పరిశీలించారు. అనంతరం అధికారిణి శ్రీలత మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు మెడికల్ షాప్‌ను పూర్తిగా తనిఖీ చేశామన్నారు.
నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాప్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తనిఖీల్లో నిజామాబాద్ రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ (Nizamabad Rural Drug Inspector Srikanth) పాల్గొన్నారు.