అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | దేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే మనం వినియోగించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) పేర్కొన్నారు. ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత స్వదేశీ వినియోగదారుల చైతన్యం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తు వినియోగం ఆవశ్యకతకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో పెట్టుబడిదారులు ఎవరున్నా సరే.. ఆయా వస్తువుల తయారీ వనకే మనమే ఉండాలన్నారు. అలాగే మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలను సఫలీకృతం చేయాలని ఆయన వివరించారు. అనారోగ్యాలకు కారణమవుతున్న కూల్‌డ్రింక్స్ (cold drinks), పిజ్జా, బర్గర్‌లాంటి జంక్ ఫుడ్స్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్‌కుమార్, సందు ప్రవీణ్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ‘భారత్ స్వదేశీ వినియోగదారుల ఉద్యమం 2.0″ (Bharat Swadeshi Consumer Movement 2.0) అనే కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైందన్నారు.
ఈ క్రమంలో జిల్లాలో మొదటి ఫేజ్ ‘ఈట్ రైట్ ఫుడ్’ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాట్ కో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాయావర్ రాజేశ్వర్, దక్షిణాది రాష్టాల వినియోగదారుల సమన్వయ సమితి ఉపాధ్యక్షుడు తంగనపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, దేవేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు.