అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heroine Srileela | 2009లో విడుదలైన లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అరుంధతి (Arundhati Movie) ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో రూపొంది భారీ విజయాన్ని సాధించింది. అనుష్క చేసిన ‘జేజమ్మ’ పాత్రకు (Jejamma Charecter) ఎవ్వరినీ పోల్చలేమన్నంత స్థాయిలో ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
Heroine Srileela | ఎంత నిజం..
అయితే తాజాగా తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా జేజమ్మ పాత్రలో శ్రీలీలను (Heroine Srileela) తీసుకునే ఆలోచన జరుగుతోందనే వార్తలు వినిపించాయి. మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమే సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. అనుష్క తర్వాత ఆ పాత్రలో మరెవరినీ ఊహించలేం” అని ఒక వర్గం అంటుంటే శ్రీలీల డాన్స్ బాగుంటుంది కానీ అనుష్క స్థాయి యాక్టింగ్ చేయగలదా?” అనే సందేహాలు మరో వర్గం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రిస్క్, తప్పక ఫ్లాప్ అవుతుంది” అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమాతో డెబ్యూ చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ‘అరుంధతి’ తమిళ రీమేక్(Tamil Remake) వార్తల్లో నిజమెంత, ఊహాగానమెంత అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. కానీ ఇప్పటికే ఈ టాపిక్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.