Kamareddy
Kamareddy | లంబాడా నాయకుల అరెస్ట్.. పోలీస్​స్టేషన్లకు తరలింపు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | లంబాడా హక్కుల పోరాట సమితి (Lambada Rights Fighting Committee) నాయకులను పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లోని (Hyderabad) ఇందిరాపార్క్​లో (Indira park) శుక్రవారం జరుగనున్న లంబాడీల ఆత్మ గౌరవ సభకు వెళ్లేందుకు సిద్ధమైన సమితి నాయకులను ముందుస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ వినోద్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా లీగల్ ఛైర్మన్ మాలోత్ జబ్బర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాట్రోత్ బద్రినాయక్, టౌన్ అధ్యక్షుడు మోహన్ నాయక్, తాడ్వాయి మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ ఉన్నారు.

అరెస్ట్ చేసిన వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా గణేష్ నాయక్ మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా సభ విజయవంతం చేయడానికి వెళ్తుంటే అక్రమ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఎన్ని అరెస్ట్​లు చేసినా తమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు.