అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | ఆసియా మార్కెట్లలోని బలహీనమైన సంకేతాలతో మన మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడిరది. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్(Profit Booking)కు ప్రాధాన్యత ఇస్తుండడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 32 పాయింట్లు పెరిగింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. దీంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 493 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ(Nifty) 13 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 18 పాయింట్లు పెరిగి లాభాల్లోకి వచ్చింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో గరిష్టాలనుంచి 142 పాయింట్లు క్షీణించింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 474 పాయింట్ల నష్టంతో 82,539 వద్ద, నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో 25,297 వద్ద ఉన్నాయి. భారత్ అభివృద్ధి చేస్తున్న ఇరాన్‌లోని చౌబహర్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల మినహాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇది మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు రూపాయి బలహీనపడుతుండడంతో మార్కెట్‌లో వొలటిలిటీ(Volatility) పెరుగుతోంది.
మిక్స్‌డ్‌గా సూచీలు..
బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.52 శాతం, పవర్ 0.85 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.72 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.67 శాతం, ఇన్‌ఫ్రా 0.44 శాతం, ఎనర్జీ 0.36 శాతం లాభాలతో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.81 శాతం, ఐటీ ఇండెక్స్(IT index) 0.75 శాతం, బ్యాంకెక్స్ 0.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.52 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.38 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం లాభంతో ఉండగా.. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో ఉండగా.. 22 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
అదాని పోర్ట్స్ 1.25 శాతం, ఆసియా పెయింట్ 1.04 శాతం, ఎస్‌బీఐ 0.93 శాతం, ఎన్టీపీసీ 0.65 శాతం, సన్‌ఫార్మా 0.61 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.35 శాతం, టైటాన్ 1.32 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.25 శాతం, ఇన్ఫోసిస్ 1.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.