Nizamsagar project
Nizamsagar project | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar project | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 67,392 క్యూసెక్కుల ఇన్​ఫ్లో (Inflow) వస్తుండగా.. అధికారులు వరద గేట్ల ద్వారా 61,038 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (water storage capacity) 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.022 టీఎంసీల నీరు ఉంది.

Nizamsagar project | పోచారంలోకి..

నాగిరెడ్డిపేట మండంలోని పోచారం ప్రాజెక్ట్​లోకి (Pocharam project) స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. వాగుల ద్వారా 2,388 క్యూసెక్కుల వరద వస్తోంది. 40 క్యూసెక్కులు ఆవిరి రూపంలో పొతుండగా మిగతా 2,348 క్యూసెక్కులు అలుగు మీద నుంచి పొంగి పొర్లుతున్నాయి.