Sriram Sagar
Sriram Sagar | శ్రీరామ్​సాగర్​లోకి భారీగా వరద

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి భారీగా వరద (Heavy flood) వస్తోంది. దీంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

మహారాష్ట్ర (Maharashtra), స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా ఇన్​ఫ్లో (heavy inflow) వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 3,68,226 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అధికారులు 12 వరద గేట్లను ఎత్తి 35,293 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా నాలుగు వేలు, కాకతీయ కాలువకు (Kakatiya canal) 4 వేలు, సరస్వతి కాలువకు 400, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ఆవిరి రూపంలో 701 క్యూసెక్కుల నీరు పోతుంది. మొత్తం ఔట్​ ఫ్లో 51,560 క్యూసెక్కులుగా ఉంది.

Sriram Sagar | పెరుగుతున్న నీటిమట్టం

ప్రాజెక్ట్​ అధికారులు నిన్నటి వరకు ఇన్​ఫ్లో కంటే ఔట్​ ఫ్లో అధికంగా ఉంచారు. దీంతో జలాశయం నీటిమట్టం తగ్గింది. ప్రస్తుతం దిగువకు నీటి విడుదలను భారీగా తగ్గించారు. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం ప్రాజెక్ట్​లో 66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 73.37 టీఎంసీలకు చేరింది. వరద గేట్లు, కాలువల (flood gates and canals) ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో గోదావరి, కాలువల పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.