Heroine Sneha
Heroine Sneha | వైర‌ల్ అవుతున్న హీరోయిన్ చిన్న‌నాటి ఫొటో.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి చాలా ద‌గ్గ‌రైంది.!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heroine Sneha | టాలీవుడ్‌కు ఎంతో మంది హీరోయిన్‌లు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కొందరు యువతలో క్రేజ్ సంపాదించగా, మరికొందరు ఫ్యామిలీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేశారు.

ఆమని, సౌందర్యలాంటి నటి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను (Family Audience) బాగా మెప్పించిన హీరోయిన్ స్నేహ తన న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ అమ్మ‌డు క‌ట్టిప‌డేస్తోంది. తాజాగా బయటకు వచ్చిన స్నేహ‌ చిన్ననాటి ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆకర్శిస్తోంది. స్నేహ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు కాగా, సినిమాల్లోకి వచ్చాక తన పేరును “స్నేహ”గా మార్చుకుంది.

Heroine Sneha | సినీ నేప‌థ్యం ఏంటి..

ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందినదే అయినా, వ్యాపార రీత్యా ముంబైలో స్థిరపడింది. వ్యాపార అవసరాల కోసం స్నేహ (Heroine Sneha) తండ్రి యూఏఈలోని షార్జాకు వెళ్లి, కుటుంబంతో అక్కడే సెటిల్ అయ్యారు. షార్జాలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో స్నేహను ఓ మలయాళీ నిర్మాత చూసి ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఆమెకు సినిమా అవకాశాన్ని ఇచ్చాడు. 2000లో మలయాళీ సినిమాతో (Malayalam Cinema) నటిగా పరిచయమైంది. అయితే, వ్యాపార నష్టాల కారణంగా కుటుంబం తిరిగి ముంబైకి చేరింది. ఈ సమయంలోనే స్నేహకు వరుసగా సినిమాల ఆఫర్లు వచ్చాయి.

మలయాళం కంటే తమిళం, తెలుగు భాషల్లోనే స్నేహకు ఎక్కువ అవకాశాలు దక్కాయి. 2001లో తరుణ్‌తో కలిసి నటించిన ప్రియమైన నీకు భారీ విజయాన్ని సాధించడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు (Sri Ramadasu) వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. స్నేహ తన కెరీర్‌లో ఎప్పుడూ హద్దులు దాటి గ్లామర్ ప్రదర్శించలేదు. 2012లో నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం స్నేహ రెండో ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. చివరిసారిగా 2019లో వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది. అప్పటి నుంచి తెలుగులో నటించలేదు.స్నేహ తిరిగి తెలుగు సినిమాల‌లో న‌టించి మెప్పించాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.