Weather Updates
Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం వరకు వేడి (Heat) అధికంగా ఉంటుంది. వాతావరణంలో తేమతో ఉక్కపోతగా ఉండనుంది. అనంతరం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, మహబూబ్​నగర్​, నారాయణపేట్​, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నిజామాబాద్​, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షాలు పడుతాయి.

Weather Updates | హైదరాబాద్ నగరంలో..

హైదరాబాద్​ (Hyderabad)లోని పలు చోట్లు సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉండనుంది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వదర నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్​ జామ్ అయింది. ప్రజలు గంటల కొద్ది రోడ్లపై నరకయాతన అనుభవించారు.

Weather Updates | రైతుల ఆందోళన

వర్షాలు వీడకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వానలతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశిస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికొస్తాయని.. ఈ సమయంలో వర్షాలు పడుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.