అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma celebrations : తెలంగాణలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ Bathukamma అయిన ఎంగిలిపూల బతుకమ్మను హైదరాబాద్లోని కూకట్పల్లి Kukatpally లో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
ఇక్కడ బతుకమ్మ వేడుకలు ముందుగా ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా (Dasara) ను కూకట్పల్లిలో ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు.
Bathukamma celebrations : ఆంజనేయస్వామి ఆలయం వద్ద..
బతుకమ్మ వేడుకల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 20న ఎంగిలిపూల బతుకమ్మ, రంగదాముని చెరువు వద్ద 29న సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అక్టోబరు 2 సాయంత్రం సీతారామాలయంలో జమ్మిపూజ జరపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.