
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia cup 2025 | అబుదాబి Abu Dhabi లో జరిగిన ఆసియా కప్ 2025 (Asia Cup 2025) గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది.
ఈ విజయంతో శ్రీలంక సూపర్-4లో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా, ఆఫ్ఘనిస్తాన్ ఓటమి బంగ్లాదేశ్‌కు ప్రయోజనం చేకూర్చింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా సూపర్-4కు అర్హత సాధించింది.
టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలోనే బ్యాటింగ్ కుప్పకూలినా, చివర్లో మహ్మద్ నబీ వీరవిహారం చేశాడు. 22 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు.
ఆ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. రషీద్ ఖాన్ కూడా 23 బంతుల్లో 24 పరుగులతో సహకరించాడు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది.
Asia cup 2025 | లక్కీ ఛాన్స్..
నువాన్ తుషారా అద్భుత బౌలింగ్ ప్రదర్శించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆఫ్ఘన్ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశాడు. మిగతా బౌలర్లు కూడా చక్కగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద స్కోరు చేయలేకపోయింది.
171 లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక Srilanka 18.4 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించింది. కుశాల్ మెండిస్ హీరోగా నిలిచాడు. అతను 52 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు.
తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు బాదాడు. అతనికి కుశాల్ పెరీరా (20 బంతుల్లో 28), చరిత్ అసలంక (12 బంతుల్లో 17), కమిందు మెండిస్ (13 బంతుల్లో 26) మద్దతు ఇచ్చారు.
స్పిన్ బౌలింగ్‌తో Spin Bowling కట్టడి చేసే ఆఫ్ఘనిస్తాన్ Afghanistan ఈ మ్యాచ్‌లో విఫలమైంది. ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీసుకోగా, కెప్టెన్ రషీద్ ఖాన్ వికెట్ లేకుండానే 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు.
మొత్తానికి ఆసియా కప్‌లో సూపర్-4కు గ్రూప్ A నుంచి భారత్, పాకిస్థాన్ అర్హత సాధించగా.. గ్రూప్ B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ Bangladesh అర్హత పొందాయి.