Gift nifty
Gift nifty | నష్టాల్లో ఆసియా మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gift nifty | అంచనాలకు అనుగుణంగానే యూఎస్‌ ఫెడ్‌ రేట్‌ కట్‌(US Fed rate cut) ప్రకటించడం, ఈ ఏడాది మరో రెండు రేట్‌ కట్‌లు ఉండొచ్చని చెప్పడంతో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీస్తోంది. యూఎస్‌కు చెందిన మేజర్‌ ఇండైసెస్‌(US major indices) గత సెషన్‌లో రికార్డు స్థాయి గరిష్టాల వద్ద ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు సైతం లాభాల బాటలో సాగాయి. కాగా శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ (Gift nifty) సైతం నెగెటివ్‌గా ఉంది.

Gift nifty | యూఎస్‌ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.07 శాతం, ఎస్‌అండ్‌పీ 0.13 శాతం లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.33 శాతం లాభంతో సాగుతోంది.

Gift nifty | యూరోప్‌ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్‌ 1.13 శాతం, ఫ్రెంచ్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.40 శాతం, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.21 శాతం లాభంతో ముగిశాయి.

Gift nifty | ఆసియా మార్కెట్లు..

గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.70 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.03 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.45 శాతం, సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ 0.34 శాతం, చైనాకు చెందిన షాంఘై(Shanghai) 0.13 శాతం హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 0.01 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.19 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్‌ డౌన్‌(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gift nifty | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 366 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. డీఐఐలు వరుసగా పద్దెనిమిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 3,326 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.29 నుంచి 1.21 కు పడిపోయింది. విక్స్‌(VIX) 3.54 శాతం తగ్గి 9.89 వద్ద ఆల్‌టైమ్‌ క్లోజింగ్‌ నమోదు చేసింది. ఇది తక్కువ వొలటాలిటీతోపాటు బుల్స్‌కు పూర్తి అనుకూల వాతావరణాన్ని సూచిస్తోంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 67.36 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు బలహీనపడి 88.13 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌తోపాటు డాలర్‌ ఇండెక్స్‌ బలపడ్డాయి. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.11 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.46 వద్ద కొనసాగుతున్నాయి.
  • యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ అదానీ గ్రూప్‌(Adani group)పై చేసిన ఆరోపణలపై సెబీ(SEBI) క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఇది అదాని గ్రూప్‌ కంపెనీలకు సానుకూలాంశం.