అక్షరటుడే, వెబ్‌డెస్క్: Komatireddy Rajagopal Reddy | ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరుకు వెళ్లిన సందర్భంగా మాట్లాడారు. తన వెనుక ఇంటెలిజెన్స్ ఉందని పేర్కొన్నారు.
తాను పార్టీ మారుతున్నానని, జగన్ YS Jagan ను కలుస్తున్నానని ప్రచారం చేశారన్నారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఒక సోదరుడిగా ఏపీకి వచ్చానని పేర్కొన్నారు.
Komatireddy Rajagopal Reddy | నేను వైఎస్సాఆర్ అభిమానిని
తాను వైఎస్సార్ YSR అభిమానినని చెప్పుకొచ్చారు. ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అది మామూలు విషయం కాదన్నారు.
వైఎస్సార్ మరణంతోనే రాష్ట్ర విభజన జరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ చర్చకు దారితీశాయి.