అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sai Chaitanya | పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో సీపీ సమీక్షించారు. పోక్సో (pocso), గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
CP Sai Chaitanya | రోడ్డు ప్రమాదాలపై..
రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. వినాయక చవితి, మిలాద్-ఉన్- నబీ పండుగలను శాంతియుతంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఉత్తమంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. దేవినవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలను శాంతియుతంగా జరుపుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆయా స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై సీపీ ఆరా తీశారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగం పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.