EPFO
EPFO | పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​​.. ఇక నుంచి ఒకే పోర్టల్​లో అన్ని సేవలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : EPFO | ఈపీఎఫ్​వో సంస్థ ఖాతాదారులకు గుడ్​న్యూస్​ చెప్పింది. సేవలను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశంలో ప్రైవేట్​ సంస్థల్లో పని చేస్తున్న కోట్లాది మంది ఈపీఎఫ్​వో ఖాతాలు కలిగి ఉన్నారు. ప్రతినెల ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ ​ఖాతా (PF Account)లో నగదు జమ అవుతుంది. అయితే ఫీఎఫ్​ నిధుల వివరాలు, క్లెయిమ్​ల కోసం ఆన్​లైన్​ ద్వారా సంస్థ సేవలు అందిస్తోంది. అయితే వాటిని మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం బ్యాలెన్స్​ చెకింగ్​ కోసం పాస్​బుక్ పోర్టల్​ లాగిన్​ కావాలి. అదే డబ్బులు విత్​ డ్రా చేయడానికి, ఇతర ​లావాదేవిల కోసం మెంబర్​ పోర్టల్​ లాగిన్​ కావాలి. ఇక నుంచి రెండు సేవలను ఒకే పోర్టల్​లో అందించాలని ఈపీఎఫ్​వో నిర్ణయించింది.

EPFO | కొత్త ఆప్షన్​

ఈపీఎఫ్​వో మెంబర్‌ పోర్టల్‌లోనే పీఎఫ్‌ లావాదేవీల వివరాలు తెలుసుకునేలా పాస్‌బుక్‌ లైట్‌ (Passbook lite) పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాస్​బుక్​ కోసం ప్రత్యకంగా లాగిన్​ కావాల్సిన అవసరం లేదు. సింగిల్‌ లాగిన్‌తోనే ఈపీఎఫ్‌ఓకు సంబంధించిన అన్ని సేవలూ పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇక నుంచి మెంబర్​ లాగిన్​లోనే పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌, విత్‌డ్రా, బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే పాస్​బుక్​ లాగిన్​ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంఉటంది. పూర్తి వివరాలు, గ్రాఫిక్స్‌తో కూడిన సమాచారం కావాలంటే మాత్రం పాస్‌బుక్‌ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.

EPFO | వేగంగా సెటిల్​మెంట్​

పీఎఫ్​ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ కూడా ఇక నుంచి ఆన్​లైన్​ పోర్టల్​లో అందుబాటు ఉండనుంది. గతంలో ఈ సర్టిఫికెట్ కేవలం కార్యాలయాల్లో మాత్రమే ఉండేది. అలాగే పీఎఫ్​ విత్​డ్రాల కోసం వచ్చిన దరఖాస్తులను సైతం వేగంగా పరిష్కరించడానికి ఈపీఎఫ్​వో చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పీఎఫ్‌ బదిలీ, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సులు, రిఫండ్‌ తదితర సేవల కోసం ఆర్పీఎఫ్‌సీ/ ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జి స్థాయి అధికారుల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ బాధ్యతలను అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌, సబార్డినేట్‌ స్థాయి ఉద్యోగులకు అప్పగించారు. దీంతో వేగంగా సెటిల్‌మెంట్లు పూర్తయి ఖాతాదారుల సమయం ఆదా అవుతుందని సంస్థ తెలిపింది.