అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nizamabad City | నగర పరిధిలోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్ఛత కార్యక్రమం (Swachhta Hi Seva Program) నిర్వహించారు.
స్వచ్ఛతా హి సేవాలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇండియా ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా విద్యార్థులకు పరిశుభ్రత గురించి వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి ధర్మానాయక్, పాఠశాల హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.