iPhone 17 offers | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అక్కడ అద్భుతమైన ఆఫర్లు
iPhone 17 offers | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అక్కడ అద్భుతమైన ఆఫర్లు

అక్షరటుడే, హైదరాబాద్: iPhone 17 offers | టాటా గ్రూప్‌‌నకు చెందిన భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ అయిన క్రోమా, కొత్త ఐఫోన్ 17 iPhone 17 శ్రేణిపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఆఫర్లు సెప్టెంబరు 19-27 మధ్య ఉంటాయి.

iPhone 17 offers | ముఖ్య ఆఫర్లు:

  • ఎక్స్ఛేంజ్ బోనస్: సెప్టెంబరు 19 – 27 మధ్య కొనుగోలు చేసే వారికి రూ. 12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
  • న్యూకాయిన్స్: టాటా Tata న్యూ HDFC కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై 10% వరకు న్యూకాయిన్స్ పొందవచ్చు.
  • వడ్డీ లేని EMI: ఐఫోన్ 17 కొనుగోళ్లపై నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
  • యాక్సెసరీస్ పై తగ్గింపు: ఈ లాంచ్ సేల్ విండోలో భాగంగా, ఎంపిక చేసిన Apple యాక్సెసరీలపై 20% వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇన్ఫినిటీ రిటైల్ లిమిటెడ్ ప్రతినిధి ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. “ప్రతి సంవత్సరం వినియోగదారులు మంచి ఎక్స్ఛేంజ్ విలువ, పారదర్శక ఫైనాన్స్ ఎంపికలు, కచ్చితమైన యాక్సెసరీలు, నిపుణుల మార్గదర్శకత్వం కోసం క్రోమా వైపు చూస్తారు. మా ఐఫోన్ 17 ప్రత్యేక ఆఫర్‌లతో, మేము అప్‌గ్రేడ్ ప్రక్రియను సులభతరం చేశాం. తద్వారా వినియోగదారులు వారికి నచ్చిన ఐఫోన్‌ను కొనుగోలు చేసి, గణనీయమైన పొదుపు, రివార్డులను పొందవచ్చు” అని వివరించారు.